తెలంగాణలో ముస్లింలకు అన్యాయం జరిగింది.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..!

Monday, March 22nd, 2021, 07:32:47 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు ముస్లిం, మైనార్టీ అభిమానులతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల తెలంగాణలో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

అంతేకాదు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ది అని అన్నారు. ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటుందని, కేంద్రం ముస్లింలను హేట్ బ్యాంక్‌గా వాడుకుంటుందని అన్నారు. మనమందరం కలిస్తే మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తేగలమని అన్నారు.