నా కోరిక అదే… ఆత్మీయ సమావేశం లో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Tuesday, March 2nd, 2021, 05:43:37 PM IST

జగన్ సోదరిగా కాకుండా, తనదైన శైలి లో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు వైఎస్ షర్మిల. అయితే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మహబూబ్ నగర్ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తి అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు అని, పాలమూరు లో వలసలు ఆగడం లేదు అని వ్యాఖ్యానించారు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లా లోనే దాదాపు రెండు లక్షల మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ది చేకూరింది అని వ్యాఖ్యానించారు.అయితే ఇప్పుడు ఆ పథకం ఎలా ఉంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే రాజన్న సంక్షేమ పాలన రావాలన్నదే తన కోరిక అంటూ వైఎస్ షర్మిల ఈ సమావేశం లో అన్నారు. అయితే పార్టీ కి సంబందించిన పనులు చూసుకుంటూనే, మెల్లగా రాష్ట్రం లోని పలు సమస్యల పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.