ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు..!

Thursday, April 15th, 2021, 06:52:28 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల మరింత దూకుడు పెంచింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఖాళీలున్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అందుకోసం దీక్ష చేయనున్నట్టు షర్మిల ఖమ్మం సంకల్ప సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేటి నుచి ఇందిరా పార్క్ వద్ద మూడు రోజులపాటు దీక్ష చేసేందుకు షర్మిల అనుమతిని కోరగా, కరోనా నేపధ్యంలో పోలీసులు ఒక్కరోజు దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

అయితే నేడు దీక్షలో కూర్చున్న వైఎస్ షర్మిలకు పలువురు నుంచి మద్ధతు లభించింది. ఈ దీక్షలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అడ్డుగా ఉన్న కెమేరాలను తొలగించమంటూ మీడియాకు సూచించిన షర్మిల అక్కడే ఉన్న సాక్షి ఛానల్ వారిపై సెటైర్లు వేశారు. ‘కవరేజ్ చేసింది చాల్లేమా అంటూ ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా అని అన్నారు. అయితే పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయమ్మ ఒక్కసారిగా బిత్తరపోయారు. వెంటనే తేరుకుని.. షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అసలు షర్మిల ఎందుకు అలా మాట్లాడిందో తెలీదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.