తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల..!

Tuesday, January 26th, 2021, 02:00:36 AM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు నిన్న ఓ ప్రముఖ దినపత్రికలో కథనం వెలువడింది. అయితే వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం ఏమిటి? ఏర్పాటు చేస్తే పార్టీ పేరు ఏమిటి? అన్న విషయం తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ కొత్త పార్టీ వార్తలపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.

అయితే తాను తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వెలువడిన వార్త తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఏ పత్రిక అయినా.. ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని, అది ఒక నీతిమాలిన చర్య అని అన్నారు. అంతేకాదు ఇలాంటి తప్పుడు రాసిన పత్రిక, ఛానల్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా తాను వెనకాడబోనని హెచ్చరించారు.