వైఎస్ షర్మిల కార్యక్రమాల సమన్వయకర్తగా వాడుక రాజగోపాల్‌..!

Monday, February 22nd, 2021, 09:00:44 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీపై స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల నేతలు, పలు సంఘాల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరుపుతున్న వైఎస్ షర్మిల మరో ముందడుగు వేసి తన పార్టీలో తొలి నియామకం చేపట్టింది. తన కార్యక్రమాల సమన్వయకర్తగా వాడుక రాజగోపాల్‌ను నియమించింది.

అయితే జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి చెందిన వాడుక రాజగోపాల్‌కు గత 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో వైఎస్ షర్మిల తన కార్యక్రమాల సమన్వయకర్తగా ఆయనను నియమించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహాలు సలహాదారులుగా ఉండనున్నారు.