ప్రత్యేక రాష్ట్రం లో మహిళలకి ఘోరంగా అన్యాయం జరిగింది – వైఎస్ షర్మిల

Monday, March 8th, 2021, 03:14:47 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కొత్త పార్టీ పెట్టేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రం లో పలు సమస్యల పై స్పందిస్తున్న షర్మిల, ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయినప్పుడు పోరాటం చేయాలి, అవకాశాలు మనమే సృష్టించాలి, అవసరం అయినప్పుడు నడుం బిగించాలి, మార్పు సాధించాలి అంటూ పిలుపు ఇచ్చారు. మహిళల త్యాగాలను గుర్తించాలి అని కాదు, కిరీటాలు పెట్టాలని కాదు, సొంత ఇళ్ళల్లో నే మహిళలకు గౌరవం లేదు అని, మహిళల్లో నే మార్పు రావాలి అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.

అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నుండి పలు రాజకీయ మార్పులను గుర్తించారు షర్మిల. తెలంగాణ లో మహిళల ప్రాతినిధ్యం ఎంత అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో మహిళలకి ఘోరంగా అన్యాయం జరిగిందని అన్నారు. వైఎస్సార్ సిఎం గా ఉన్నప్పుడు మహిళలకి, మంత్రులకు అవకాశాలు కల్పించారు అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ లో మహిళకి మంత్రి పదవి దక్కడానికి అయిదేళ్ళు పట్టింది అంటూ చెప్పుకొచ్చారు.