కళ్ళు, చెవులు మూసుకొని కేసీఆర్ పరిపాలన చేస్తున్నారు – వైఎస్ షర్మిల

Thursday, May 13th, 2021, 05:35:03 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగుతుంది, కేసీఆర్ గారు కళ్ళు చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఇక చిన్న సారు కేటీఆర్ గారికి కరోనా కష్టాలు కనిపిస్తలేవు, వినిపిస్తలేవని రెమిడెసివిర్ ఇంజక్షన్‌ల కోసం జనం చాంతాడంత క్యూలు కట్టేది కనిపిస్తలేదని అన్నారు.

రూ.3500 ఇంజక్షన్ 40 వేలు పెట్టి కొంటున్నమన్న గగ్గోలు వినిపిస్తలేదని, ఆక్సిజన్ లేక కరోనా రోగులు చస్తుంటే నాకేం పట్టి అని చూస్తున్నరు. తండ్రీకొడుకులు గారడి మాటలు పక్కన పెట్టి బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడివిసిర్ల కొరత ఉందని ఒప్పుకొని, వాటిని ఎలా అందించాలో ఆలోచించండని వైఎస్ షర్మిల అన్నారు.