రేపటినుండి వైఎస్ షర్మిల నిరాహార దీక్ష… కానీ!

Wednesday, April 14th, 2021, 03:25:22 PM IST

తెలంగాణ రాష్ట్రం లో వైఎస్ షర్మిల రేపటి నుండి నిరాహార దీక్ష ప్రారంభం చేయనున్నారు. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మం లో జరిగిన బహిరంగ సభలో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని యెడల నిరాహార దీక్ష చేపడతానని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చెప్పినట్లు గానే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టేందుకు షర్మిల కి పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పోలీసులు తీసుకున్న నిర్ణయం తో లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.అయితే అనుకున్నట్లుగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారా లేకపోతే పోలీసులు అనుమతి ఇచ్చిన దాని ప్రకారం ఒక రోజే చేస్తారా అనేది సర్వత్రా చర్చంశ నీయం గా మారింది.