బిగ్ న్యూస్ : ఏపీ కొత్త రాజధానిపై అప్పుడే జగన్ సర్కార్ స్పెషల్ ఫోకస్.!

Sunday, August 2nd, 2020, 12:11:09 PM IST

ఏది ఏమైనప్పటుకీ మాత్రం ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకొని తీరారు. ఇటీవలే ఏపీ గవర్నర్ ఈ మూడు రాజధానులకు ఆమోదం ఇవ్వడంతో వైసీపీ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహం మొదలయ్యింది.

ఇదిలా ఉండగా ఏపీలో మూడు రాజధానులు ఉన్నా సరే ప్రధాన పరిపాలన అంతా విశాఖ నుంచే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఎలాగో ఆమోదం రావడంతో జగన్ సర్కార్ అప్పుడే విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. పరిపాలనా రాజధాని అయినటువంటి విశాఖలో ఉన్న పోలీసు వ్యవస్థపై మొదటిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

అక్కడ పోలీసు వనరుల పెంపుపై అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందుకోసం ఒక ప్రత్యేకమైన టీం ను చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి మాత్రం ఏపీలో సరికొత్త రాజధాని విషయంలో జగన్ ఆట మొదలయ్యిపోయింది అని చెప్పాలి.