హాట్ టాపిక్ : పవన్ ను అడ్డుకునేందుకే జగన్ ఈ వ్యూహం.?

Friday, February 14th, 2020, 11:23:19 AM IST


ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత వేగవంతంగా దూసుకుపోతున్నారు.రాబోయే రోజుల్లో ఓ బలమైన ప్రత్నామ్యాయం గా మారే దిశగా దొరికిన ఏ చిన్న సమస్యను కూడా వదలకుండా తన పార్టీకు మైలేజీ ఇచ్చేలా మార్చుకుంటున్నారు.దీనితో పవన్ వల్ల రాబోయే రోజుల్లో ఎక్కువగా నష్టం తమకే ఉండబోతుంది అని అనుకున్నారో ఏమో కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ పవన్ పై ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా రాజకీయ వర్గాల్లో ఓ అంశం హాట్ టాపిక్ అవుతుంది.పవన్ ను ఎలా అయినా సరే అడ్డుకొనేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

అందుకే ఇప్పుడు పవన్ కు పోటీగా తన అన్నయ్య చిరంజీవిని రంగంలోకి దింపబోతున్నారని ఊహాగానాలు గత కొంత కాలం నుంచి వినిపిస్తుండగా అవి ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ల వరకు వచ్చేసాయి. చిరుకు జగన్ రాజ్యసభ పదవిని ఇవ్వబోతున్నారని మెల్లగా వార్తలు వదిలారు.వీటిలో ఎంత వరకు నిజముందో కానీ జనసేన శ్రేణుల్లో మాత్రం ఒకరకమైన గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పడం అయితే ఖాయమని ఇదే ఈ వ్యూహం తాలూకా అసలు కోణం అని మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ చిరు రాజకీయ అరంగేట్రం చెయ్యడం జరగదని చిరు లాయల్ ఫ్యాన్స్ అంటున్నారు.