కొత్త నోట్లతో సేల్ఫీలు దిగుతున్న యువత…!!

Thursday, November 10th, 2016, 02:40:52 PM IST


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో వచ్చినప్పటి నుంచి యువత తన చుట్టూ జరుగుతున్న ఆశ్చర్యకరమైన సంఘటనలను, ఆబ్బురపరిచే దృశ్యాలను కేమారాల్లో బందిస్తూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి తెగ సంబర పడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో యువతలో సేల్ఫీ ల మోజు విపరీతంగా పెరిగిపోయింది. కొత్తది, వింతైనది ఏది కనిపించినా దానితో సేల్ఫీ దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం నేడు సరి కొత్త స్టైల్. మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త నోట్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. అయితే వీటిని తీసుకున్న ప్రజలు సంబరపడుతూ వాటితో సేల్ఫీలు దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఈ కొత్త నోట్లే హల్ చల్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సైట్లలో కొత్త నోట్లు చేతికందాయన్న ఆనందాన్ని పంచుకుంటున్న వారి సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుతోంది.