బిగ్ వైరల్: కూలగొట్టి కట్టాల్సింది సెక్రటేరియట్ కాదు..!

Thursday, October 15th, 2020, 04:16:13 PM IST

తెలంగాణలో మొన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో చెరువులు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు వరద నీటిలో చిక్కుకుని గల్లంతు కాగా, కొన్ని కార్లు బైకులు నీటి ఉదృతికి కొట్టుకుపోయాయి.

అయితే హైదరాబాద్ నగరంలో ఇంతటి వర్ష బీభత్సం సృస్టించడం ప్రభుత్వ వైఫల్యమే కారణమని సామాన్యులు మండిపడుతున్నారు. ఈ తరుణంలో సిటీలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్న డిమాండ్ కూడా గట్టిగానే వినబడుతుంది. రోజు రోజుకు సిటీ విస్తరిస్తున్నా నిజాం కాలం నాటి నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంనే వాడడంతో వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అన్నారు. అయితే తాజాగా ఓ యువకుడు వాననీటిలో నిలబడి “కూలగొట్టి కట్టాల్సింది సెక్రటేరియట్ కాదు డ్రైనేజీ సిస్టం కేసీఆర్ సర్ అంటూ ప్లకార్డును ప్రదర్శిస్తున్న ఫోటో తెగ వైరల్ అవుతుంది.