బిగ్ వైరల్: పందెం కోసం 29వ అంతస్తుపై యువతి సాహసం..!

Tuesday, August 11th, 2020, 06:23:23 PM IST

చెన్నైలోని మహాబళిపురంలో ఓ యువతి ఒళ్ళు గగుర్పుడిచే సాహసం చేసింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్తులో ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్‌లోకి సునాయాసంగా వెళ్ళింది. ఎలాంటి సేఫ్టీ వాడకుండా, అంత ఎత్తులో ఉన్న భయపడకుండా చాలా స్పీడుగా ఆ యువతి బ్లాక్ మారింది.

అయితే కింద చూసిన వారు ముందు దయ్యమేమో అనుకుని భయపడినా ఆ తరువాత ఓ యువతి అని నిర్ధారణకు రాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అసలు ఆ యువతి ఎవరు? ఎందుకు అంత ఎత్తైన భవనంపై ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్‌కి వెళ్ళింది అన్న దానిపై ఆరా తీయగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. సదరు యువతి తన సోదరుడితో బెట్ కట్టి అలా చేసిందని, కేవలం పందెంలో గెలవాలన్న లక్ష్యంతోనే ఆ యువతి అంత ఎత్తులో ఆ సాహసానికి ఒడిగట్టిందని తెలిపింది. అయితే ఆ యువతి గెలవాలన్న లక్ష్యంతో చేసిన పని బాగానే ఉన్నా, ఎలాంటి సేఫ్టీ తీసుకోకుండా రిస్క్ చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని పలువురు సీరియస్ అవుతున్నారు.