ఫ్లాష్ న్యూస్: ఫిదా నటుడు కి కరోనా పాజిటివ్

Tuesday, October 6th, 2020, 05:30:52 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇప్పుడు అప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. తాజాగా యువ నటుడు హర్ష వర్ధన్ రాణే కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయం గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జ్వరం మరియు కడుపు లో నొప్పి రావడం తో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న విషయాన్ని తెలిపారు. అయితే ఈ పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.అయితే ప్రస్తుతం హర్ష వర్ధన్ స్వీయ నిర్బంధం లో ఉన్నట్లు తెలిపారు.

హర్ష వర్ధన్ బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు నాట సైతం పలు చిత్రాల్లో నటించారు. తకిట తకిట, అవును, అవును2, నా ఇష్టం, ప్రేమ ఇష్క్ కాదల్, అనామిక, మాయ, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, బెంగాల్ టైగర్ లో నటించారు. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రం తో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో. ఇప్పటికే పలువురు కరోనా వైరస్ భారిన పడగా, తాజాగా మరొక హీరో కరోనా తో అనారోగ్యం పలు అవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.