బాలకృష్ణ కి వైసీపీ షాక్…హిందూపూర్ లో వైసీపీ హవా

Monday, February 22nd, 2021, 09:01:17 AM IST

నందమూరి బాలకృష్ణ నటుడు గా ఎన్నో అద్భుతాలు చేశారు. అదే విధంగా రాజకీయాల్లో కూడా తను చెరగని ముద్ర వేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి పాలు అయినప్పటికీ హిందూపురం నియోజక వర్గంలో బాలకృష్ణ ఎమ్మెల్యే గా గెలుపొందారు. అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలలో హిందూపురం నియోజక వర్గంలో బాలయ్య కి ఎదురు దెబ్బ తగిలింది. హిందూపురం లోని 38 స్థానాల్లో 30 చోట్ల వైసీపీ మద్దతు దారులు ఘన విజయం సాధించారు. అయితే బాలకృష్ణ కి మాత్రమే కాకుండా తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతల నియోజక వర్గాలలో వైసీపీ పాగా వేసింది.

మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి, ఆయన సొంత పంచాయతీ అయిన రొద్దం లో టీడీపీ ఓటమి పాలు అయింది. పెనుకొండ లోని మొత్తం 80 స్థానాల్లో 71 వైసీపీ మద్దతు దారులు గెలుపొందారు. అయితే మొత్తంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మరొకసారి ప్రజల పార్టీ అని అర్దం అవుతుంది.