ప్రతి పక్ష నేత చంద్రబాబు ను ఏకి పారేసిన విజయ సాయి రెడ్డి… మరీ ఇంత దారుణంగానా?

Friday, May 22nd, 2020, 05:55:28 PM IST

వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొత్తి రెడ్డి పాడు ప్రాజెక్ట్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో వాడివేడిగా చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో విజయ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడు తీరు పై ఘాటు విమర్శలు చేశారు.గతంలో తమిళ నాడు సీఎం జయలలిత కుమార్తె నని ఎవరో ఒక అమ్మాయి కోర్టు కి ఎక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొక ఆయన కోర్టుకెక్కడం చూశాం అని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డపాడు కట్టింది తానే అని చంద్రబాబు సిగ్గు లేకుండా క్లెయిమ్ చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే అని వ్యాఖ్యానించారు. అంతేకాక చంద్రబాబు హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అయితే కరెంట్ బిల్లు లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.దీని పై కూడా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు. కరెంట్ గురించి జగన్ గారికి అసలు అవగాహన లేదట అని అన్నారు. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్ గారికి లేదు అని అన్నారు. పైగా ఒప్పందాలను రద్దు చేయాలని అంటున్నాడు అని విజయ సాయి రెడ్డి అన్నారు.ఇసుక నుండి తైలం తీసే మీ తెలివి అయనకెక్కడిది అని సెటైర్స్ వేశారు.