ఏపీ ప్రభుత్వం మరిన్ని జనరంజక నిర్ణయాలు – వైసీపీ ఎంపీ

Sunday, December 20th, 2020, 09:00:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గారి నేతృత్వంలో మరిన్ని జనరంజక నిర్ణయాలు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. మూడో విడత రైతు భరోసా, పర్యాటక – సినిమాలకు రీస్టార్ట్ ప్యాకేజీ, కొత్త మెడికల్ కాలేజీలు, ఎత్తిపోతల పథకాలు, నివర్ నష్టపరిహారం 29 నే పంపిణీ అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కరోనా తో దేశమంతా అల్లాడుతుంటే ఆ ప్రభావం రాష్ట్ర ప్రజల పై పడకుండా చర్యలు అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. అయితే వైసీపీ చేస్తున్న పనుల పట్ల టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.