ఈ ఘనత వైఎస్సార్ మరియు సీఎం జగన్ గారిదే

Thursday, November 26th, 2020, 01:55:55 PM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆరోగ్య భీమా ద్వారా ప్రజలు లబ్ది పొందుతున్నారు అని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలోనే ఆరోగ్య భీమా పొందుతున్న వారిలో ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ 1 అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భీమా పొందుతున్న వారు దేశ సగటు గ్రామాల్లో 12.9, పట్టణాల్లో 8.9 శాతం అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామాల్లో 76.1 శాతం, పట్టణాల్లో 55.9 శాతం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ ఘనత దివంగత మహానేత వైఎస్సార్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదే అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. భీమా అందని వారు వైసీపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఇసుక అందకపోవడం వలన జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ వైసీపీ పాలనా విధానం పై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.