కరోనా కట్టడిలో దేశంలోనే ఏపీ మూడవ స్థానం

Monday, November 30th, 2020, 09:00:21 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పరిస్థితులు మారుతున్నాయి అని పలువురు వైసీపీ నేతలు అంటున్నారు. గత ప్రభుత్వ పాలన కంటే వైసీపీ పాలన లో రాష్ట్రం అభివృద్ధి పధం లోకి దూసుకుపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే మరొకసారి వైసీపీ పాలనా విధానం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతి మీడియా లో కాదు, జాతీయ మీడియా లో, ఆర్ధికాభివృద్ధి లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం టాప్ అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడి లో దేశంలోనే మూడవ స్థానం అని అన్నారు. అయితే ఆర్ధిక, పర్యాటక రంగం మెరుగుపడిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానం అని అన్నారు. ఇండియా టుడే స్టడీ 2020 లో వెల్లడి అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. జాతి మీడియా ఎంత ఏడ్చినా ప్రజలకు వాస్తవాలు తెలియక మానవు అని అన్నారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. దంత వైద్యులు కరోనా వైరస్ మహమ్మారి కాలం లో అహర్నిశలు పనిచేసినా ఇంకా నాలుగు నెలల వేతనాలు ఇవ్వలేదు అని పేర్కొన్నారు. ఈ విషయం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయ తీసుకోవాలని, అంతేకాక తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ విన్నవించుకున్నారు. పలువురు మాత్రం పలు సమస్యల గురించి ప్రస్తావిస్తూ వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.