ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ – వైసీపీ ఎంపీ

Sunday, December 13th, 2020, 09:15:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు సమస్యల పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ మేరకు ఉద్దాన కిడ్నీ సమస్యల పట్ల శాశ్వత పరిష్కారం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడుతుంది సీఎం జగన్ గారి ప్రభుత్వం అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 700 కోట్ల రూపాయల తో ఉద్దానం లోని ఏడు మండలాల కి నీరందించే పథకం ప్రవేశ పెడుతోంది అని విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

హిరమండలం రిజర్వాయర్ నుండి ఉద్దానం కి మంచినీటి సరఫరా పట్ల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎనిమి లక్షల మంది ప్రజలకు ఇదొ సంజీవని అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కలుషిత భూగర్భ జలాల సమస్యే ఉండదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాక వాటి వల్ల వచ్చే జబ్బులు ఉండవు అని అన్నారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.