కార్పొరేట్ స్థాయికి తీసుకువెళతారు ప్రభుత్వ వైద్యాన్ని – వైసీపీ ఎంపీ

Wednesday, December 9th, 2020, 03:51:44 PM IST

Ycp-mp-Vijayasai-reddy

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజారోగ్యం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న శ్రద్ద ఇంకే రాష్ట్రంలో కనిపించదు అని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిదిలోకి కరోనా చికిత్స ను తీసుకు రావడం పెద్ద సాహసం అంటూ కొనియాడారు. మరో 234 జబ్బులను చేర్చారు అని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. 108, 104 సేవలకు ప్రాణం పోశారు అంటూ ప్రశంసించారు. వచ్చే మూడున్నర ఏళ్లలో కార్పొరేట్ స్థాయికి తీసుకువెళతారు ప్రభుత్వ వైద్యాన్ని అంటూ వ్యాఖ్యానించారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం విజయసాయి రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్లి విజయసాయి రెడ్డి వైద్యము చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయసాయి రెడ్డి అందుకే హైదరాబాద్ లో వైద్యం చేయించుకున్నారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇంతకు ముందు నుండే 108, 104 ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు.