పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు – వైసీపీ ఎంపీ

Thursday, July 2nd, 2020, 09:19:49 AM IST

వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి మరొకసారి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల పై ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పాలన లో జరిగిన అవినీతిని పరిశుద్ధం చేసుకుంటూ జగన్ ఉత్తమ పాలన సాగిస్తున్నారు అని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో అమర్ రాజ ఇన్ఫ్రా పై విజయ సాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 253 ఎకరాల భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లు అయినా అమర రాజ ఇన్ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్ల లోగా ఫ్యాక్టరీ పెట్టీ, 20 వేల మందికి ఉద్యోగాలను కల్పించాలి అన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయితే అవేవీ జరగక భూమి ను వెనక్కు తీసుకున్న నిర్ణయం ను విజయ సాయి రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ విషయం పై పెద్ద, చిట్టి నాయుల్లు గుండెలు బాదుకుంటూ ఉన్నారు అని విజయ సాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అంతేకాక నిబంధనలు అమలు చేస్తే కక్ష సాధింపు అంట అంటూ సెటైర్స్ వేశారు విజయ సాయి రెడ్డి. అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన జగన్ పై టీడీపీ నేతలు ఇంకా విమర్శలు చేస్తున్న నేపధ్యం లో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే మరోసారి విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది.