దేనికైనా తెగించే డెడ్లీ పొలిటికల్ వైరస్ నారానిప్పు – విజయసాయి రెడ్డి!

Wednesday, August 5th, 2020, 03:00:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంటే, మరో పక్క రాష్ట్ర రాజధాని అంశం పై అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే వీటి తో మాత్రమే కాక, రాజీనామా ల సవాళ్లు సైతం హాట్ టాపిక్ చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో లో వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి మరొకసారి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి లేనపుడు స్థానిక సంస్థల ఎన్నికలకి భయపడిన బాబు, ఇపుడు వైరస్ వ్యాప్తి ఉన్న సమయం లో మళ్లీ ఎన్నికలు అంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు అని విమర్శించారు. అయితే సవాల్ సిల్లీగా ఉన్నా, ప్రజల భద్రత పై నారావారి నిబద్దత ఏంటో అర్థం అయిపోయింది అని ఎద్దేవా చేశారు. తన స్వార్థం కోసం దేనికైనా తెగించే డెడ్లీ పొలిటికల్ వైరస్ నారనిప్పు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీ పై విరుచుకు పడుతుండగా, తాజాగా ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.