32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చిపడిందా?

Tuesday, November 24th, 2020, 07:31:04 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి నియోజకవర్గం లో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలో ఇప్పటికే వైసీపీ అభ్యర్ధి విషయం లో ఒక స్పష్టత రాగా, టీడీపీ అభ్యర్థి విషయం లో ఇంకా అయోమయం నెలకొంది. అయితే ఈ విషయం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అకటా, 32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చి పడిందా? అంటూ ఎద్దేవా చేశారు. తిరుపతి బై ఎలక్షన్ కి అభ్యర్ధి దొరకడం లేదట అంటూ వ్యాఖ్యానించారు. టికెట్ ఇచ్చి కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడినా ఎవరూ ముందుకు రావడం లేదు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఇదే దరిద్రం జిడ్డులా పట్టుకుంటే నిమ్మగడ్డ తో వాయిదా వేయించి తప్పించుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు.ఇప్పుడెలా అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ పై వరుస విమర్శలు చేస్తూ ఘాటుగా వ్యాఖ్యానించారు.