తండ్రీ కొడుకులు మాత్రం కరోనా భీతితో దాక్కున్నారు

Monday, November 23rd, 2020, 10:13:54 AM IST

Ycp-mp-Vijayasai-reddy

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా గతంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు అన్ని కూడా లాక్ డౌన్ కారణం గా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అయితే సడలింపుల తర్వాత తమ తమ సొంత ప్రాంతాలకు, సొంత గ్రామాలకు, వలస కూలీలు కూడా మళ్లీ పనుల కోసం వెళ్తున్నారు. అయితే ఇదే విషయాన్ని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై, మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చే వలస పక్షుల సందడి రాష్ట్రంలో మొదలైంది అని, లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలసకూలీలు కూడా పనుల్లో చేరేందుకు వెనక్కి తిరిగి వస్తున్నారు అని అన్నారు. అయితే ప్రవాసంలో ఉన్న తండ్రీ కొడుకులు మాత్రం కరోనా భీతితో తలుపులు బిగించుకొని ఇంట్లో దాక్కున్నారు అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ తీరు ను ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ నేతల పై విమర్శలు చేస్తున్నారు.