ఎవరికీ ప్రజాదరణ లేదు – విజయసాయి రెడ్డి

Wednesday, December 30th, 2020, 11:01:38 AM IST

Vijaya-Sai-Reddy

ప్రతి పక్ష పార్టీ నేతలు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలకి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగు దేశం పార్టీ అగ్ర నాయకుల పై విజయసాయి రెడ్డి వరుస విమర్శలు చేశారు. తండ్రి జూమ్ లో, కొడుకు ట్విట్టర్ లో వీరంగాలు వేస్తుంటారు అంటూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విష ప్రచార బాధ్యతలు ఎల్లో మీడియా చూసుకుంటుంది అని అన్నారు. అంతేకాక ప్యాకేజీ పార్టీలు కారాలు, మిరియాలు నూరుతుంటాయి అంటూ మద్దతు పార్టీల పై ఘాటు విమర్శలు చేశారు. అయితే ఎవరికీ ప్రజాదరణ లేదు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. విశ్వసనీయత అసలే లేదు అని, అయినా నిత్యం తాటాకు చప్పుళ్లు చేస్తూనే ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పలు చోట్ల ప్రజల పై, టీడీపీ పై జరుగుతున్న చర్యలను ప్రస్తావిస్తూ వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. అయితే ప్రజాదరణ లేకపోతే మంత్రులు ఎందుకు స్పందిస్తున్నారు అంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు. పవన్, టీడీపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలకు వైసీపీ నేతలు మండిపడుతున్నారు.