ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్ – వైసీపీ ఎంపీ

Sunday, September 13th, 2020, 01:37:04 PM IST

అధికార పార్టీ తీరు ను ప్రశ్నిస్తూ, వరుస విమర్శలు చేస్తున్న నారా లోకేష్ పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కి దిమ్మ తిరిగే రేంజ్ లో గట్టి కౌంటర్ ఇచ్చారు.లోకేశం అంటూ సంబోధిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. నేచురల్ గ్యాస్ కి ఎల్పీజీ కి మధ్య కూడా తేడా తెలియదా అని నారా లోకేష్ ను ఎద్దేవా చేశారు. నేచురల్ గ్యాస్ వ్యాట్ లో మార్పులు జరిగితే ఎల్పీజీ పై అని దుష్ప్రచారం చేయిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఎల్పీజీ పై టాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్ అంటూ విమర్శించారు. లోకం నవ్వుతుంది పప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి, ఇటీవల నారా చంద్రబాబు నాయుడు పై వరుస గా ఎడిటోరియల్స్ రాసిన విషయం గుర్తు తెస్తూ విమర్శలు చేస్తున్నారు.రాష్ట్రం లో ఒక రోడ్డు కానీ, ఒక బిల్డింగ్ కానీ కట్టిన పాపాన పోలేదు అని, కానీ, అందరినీ విమర్శిస్తూ ఎడిటోరియల్స్ రాస్తావు అంటూ విమర్శలు చేస్తున్నారు.