చంద్రబాబు, లోకేష్ ల పై మరొకసారి వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Wednesday, August 19th, 2020, 07:01:05 PM IST

Ycp-mp-vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ల పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మరొకసారి వీరి పై కీలక వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి. పార్టీ వ్యవహారాలను కొడుకు కి అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. వయసు పెరగడం, జ్ఞాపక శక్తి క్షీణించడంతో కుమారుడి కి పగ్గాలు ఇస్తారంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనా ఉధృతి తగ్గగానే లోకేష్ నాయుడు ను కాబోయే సీఎం గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని యెల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ల పై విమర్శలు చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కేసుల కోసం కాళ్ళు పట్టుకోవడం లేదు అని పరోక్షంగా అంటూనే సెటైర్స్ వేశారు. ఇంకొందరు మాత్రం నారా లోకేష్ తీరు పై విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ కంటే సీనియర్స్ పార్టీ లో ఉన్నారు అని, మరి వాళ్ళ పరిస్తితి ఏంటి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.