ఆ మాటలు బాబుకు అసలు గిట్టవు – విజయసాయి రెడ్డి

Tuesday, March 23rd, 2021, 12:03:25 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత, రివర్స్ టెండరింగ్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల పరిశీలన అనే మాటలు బాబుకు అసలు గిట్టవు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వనరులను దోచుకోవాలి కానీ, ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక సరఫరాకు టెండర్లు పిలిస్తే పిచ్చి ఆరోపణలు చేయిస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం లో ఉండగా, చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ అన్నప్పుడే ట్రాక్టర్ ఇసుక 800 రూపాయలకు వచ్చేది అని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం అమ్మితేనే అదే ట్రాక్టర్ ఇసుక 3,500 రూపాయలు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చి వ్యాపారం చేయమంటే లాభానికి కాక, నష్టానికి అమ్ముకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయము పదుల సంఖ్యలో సూట్కేస్ కంపనీ లు పెట్టిన నీకు తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మరి కొందరు మాత్రం ఈ టెండర్ ప్రక్రియ లో అవినీతి జరగలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అటు జన సేన పార్టీ కి చెందిన వారు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.