ప్రజలకే వెన్నుపోటు పొడవాలనుకుంటున్నాడు – విజయసాయి రెడ్డి

Sunday, January 10th, 2021, 09:26:30 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. వయసు అనుభవం పెరిగే కొద్దీ హుందాగా వ్యవహరించాలి కానీ చంద్రబాబు మాత్రం మరింత దిగజారుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి మూలన కూర్చోబెట్టడమే ఇందుకు కారణం అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. వెన్నుపోటు పొడవాలన్నా ఎవరైనా నమ్మలిగా అంటూ విమర్శించారు. అందుకే కరోనా కేసులు పెంచి ప్రజలకే వెన్నుపోటు పొదవాలనుకుంటున్నాడు అని ఆరోపించారు.

అయితే రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం లో సైతం అధికార పార్టీ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటు అటు టీడీపీ సైతం వరుస విమర్శలు చేస్తూనే ఉన్నాయి. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ పలువురు చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వైసీపీ పాలనా విధానం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.