ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది – వైసీపీ ఎంపీ

Monday, December 21st, 2020, 07:30:56 AM IST

Ycp-mp-Vijayasai-reddy

విశాఖలో ఒక్కో పచ్చ నేత భూ బాగోతాలు బయట పడుతున్నాయి అని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నేతలే విశాఖ జిల్లాలో లిక్కర్ మాఫియా నడిపారు అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అండతో వేల కోట్లు విలువైన ప్రభుత్వ, ప్రైవేటు, దేవాలయ భూములను అక్రమం గా దోచేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆక్రమణ దారుడు ఎంతటివాడైనా ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే గత టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉండగా భారీ అక్రమాలకు, అవినీతికి పాల్పడింది అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు తరచూ విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వం హయాంలో టీడీపీ చేసిన చర్యలు అంటూ విజయసాయి రెడ్డి మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు వైసీపీ కి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.