నిమ్మగడ్డ పై భరోసా కాబోలు – వైసీపీ ఎంపీ

Friday, December 18th, 2020, 08:18:26 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల విలువ తగ్గిందనే ఆర్తనాదాలు తప్ప ఏడాదిన్నర లో ప్రజా సమస్యల పై బాబు చేసిన పోరాటం ఒక్కటీ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కౌంటింగ్ మొదటి మూడు రౌండ్ లలో వెనక్కి నెట్టినందుకు కుప్పం ప్రజల పైన కక్ష పెంచుకున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్థానిక ఎన్నికలు జరిగితే విజయ ఢంకా మోగిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ పై భరోసా కాబోలు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ ఏడాది లో వర్షం కారణంగా నష్టపోని రైతు అంటూ లేదు. వారికి సహాయం చేసే ఉద్దేశ్యం ఏదైనా ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి కొందరు మాత్రం 2024 లో ఇదే పరిస్తితి అంటూ వైసీపీ పై సెటైర్స్ చేస్తున్నారు.