బాబు జమానాలో ఇలాంటివి కోకొల్లలు – వైసీపీ ఎంపీ

Thursday, December 10th, 2020, 02:37:23 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. హంద్రీ నీవా ద్వారా అనంతలోని పేరూర్ డ్యాం కు నీటిని తరలించే కాల్వల తవ్వకానికి బాబు హయం లో మూడింతలు ఎక్కువగా 850 కోట్ల రూపాయలు కేటాయించారు అని అన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అవే నిధులతో కొత్తగా 3.3 టీఎంసీ ల సామర్ధ్యం ఉండే 3 రిజర్వాయర్ల కి భూమి పూజ చేశారు అని చెప్పుకొచ్చారు. అయితే బాబు జమానా లో ఇలాంటివి కోకొల్లలు అంటూ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ అధికారం లో ఉందని, గత ప్రభుత్వం తప్పు చేస్తే చర్యలు తీసుకోకుండా, ఇలా సోషల్ మీడియా వేదికగా చెప్పడం పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.