అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా? – వైసీపీ ఎంపీ

Monday, December 7th, 2020, 10:28:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ ప్రభావం ఎక్కువ గానే ఉందని తెలుస్తోంది. అయితే అధికారం కోల్పోయిన అనంతరం నుండి వైసీపీ కి టార్గెట్ అయింది. ఇప్పటికే పలు అంశాల్లో టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు వరుస ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రచారం మీద బతికే అసమర్డుడికి యెల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ ఇచ్చింది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దిగిపోయి ముందు ఆఖరి సంవత్సరం లో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని చెల్లించాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అడ్మనిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా అంటూ సూటిగా ప్రశ్నించారు. కాగా నివేదిక పై మాట్లాడే ధైర్యము ఉందా బాబు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు వరుస విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత అధికారం చేతిలో ఉంచుకొని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకుండా, చంద్రబాబు పై రోజు విమర్శలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.