కట్టుకథలు చెప్పి అడ్డంగా దొరికిపోతున్నాడు – వైసీపీ ఎంపీ

Sunday, December 6th, 2020, 02:07:28 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూమ్ మీటింగ్ లకు అలవాటు పడిన ప్రతి పక్ష నేత అసెంబ్లీ సమావేశాల్లో లోపలి కంటే బయటే ఎక్కువ గా గడిపాడు అని సెటైర్స్ వేశారు. అను కుల మీడియా కొంగు చాటున దాక్కునే రోజులు పోయాయి అని అన్నారు. పాలు నీళ్లను వేరు చేసి చూపే సోషల్ మీడియా ప్రభావ శీల ప్రత్యామ్నాయం గా అవతరించిన తర్వాత కట్టుకథలు చెప్పి అడ్డంగా దొరికిపోతున్నాడు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒక పక్క వైసీపీ పాలన విధానం పై నెటిజన్లు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతల పై, వైసీపీ పై నెటిజన్లు వరుస విమర్శలు చేస్తూ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అయితే అసెంబ్లీ లో జరిగిన సమావేశాల్లో ఇప్పటికే టీడీపీ కి మరియు వైసీపీ కి మధ్యలో తీవ్ర స్థాయిలో మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.