చంద్రబాబుకి రాజకీయం గా ఇదే ఆఖరి టర్మ్

Friday, December 4th, 2020, 07:32:50 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో అధికార పార్టీ వైసీపీ కి, ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ కి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే ఈ క్రమం లోనే చంద్రబాబు నాయుడు సీఎం జగన్ ను ఫేక్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి చంద్రబాబు నాయుడు ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫేక్ అనే పదానికి ప్యాంటు, షర్టు, ముక్కుకు మాస్కు, చేతులకు గ్లోవ్స్ తోడిగితే అది చంద్రబాబే అంటూ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నీరాజనం పడుతున్న యువ ముఖ్యమంత్రి పైనోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తూ జనంలో మరింత పల్చన అవుతున్నాడు అని వ్యాఖ్యానించారు. చేయనిది చేసినట్టుగా భ్రాంతి కల్పించే చంద్రబాబు కి రాజకీయంగా ఇదే ఆఖరి టర్మ్ అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం టీడీపీ ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.