మీలాగే భ్రమపడి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాడు – వైసీపీ ఎంపీ

Thursday, December 3rd, 2020, 03:34:11 PM IST

Vijaya_sai

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎత్తు గురించి తెలుగు దేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయం పై ఒక స్పష్టత ఇచ్చినప్పటికీ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం పట్ల మరొకసారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.

పోలవరం ఎత్తు గురించి బాబు మరియు అనుకుల మీడియా పదేపదే అబద్ధాలు చెబుతున్నారు అని ఆరోపించారు. ఒక అసత్యాన్ని వందల సార్లు చెబితే జనం నమ్ముతారు అన్న సిద్దాంతం రూపకర్త జోసెఫ్ గోబెల్స్ మీలాగే భ్రమపడి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పరిస్తితి అంతే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశం పై నెటిజన్లు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఒక పక్క పోలవరం ఎత్తు తగ్గించే అంశం పై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు మాత్రం టీడీపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.