మీరేమో చీకట్లో పొర్లి పొర్లి ఏడుస్తున్నారు – వైసీపీ ఎంపీ

Monday, November 16th, 2020, 08:30:21 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయం లో చంద్రబాబు నాయుడు తీరు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే వైసీపీ కి చెందిన కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం పునాది వేసింది మీరు కాదు, పూర్తి చేసే బాధ్యత మీకు లేదు అంటూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఏటీఎం లా వాడుకొని బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు అంటూ ఆరోపించారు. భజన మీడియా ద్వారా అబద్ధాలు మొదలు పెట్టారు అని విమర్శించారు. అయితే ఎత్తు తగ్గిస్తున్నట్టుగా కలోచ్చిందా అంటూ సెటైర్ వేశారు అంతేకాక అంతా దీపావళి పండుగ జరుపుకుంటుంటే మీరేమో చీకట్లో పొర్లి పొర్లి ఏడుస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి పై వరుస విమర్శలు చేస్తున్నారు. కొందరు వైసీపీ తీరును విమర్శిస్తుండగా, మరి కొందరు మాత్రం టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.