గతంలో ఇలా ఎప్పుడైనా స్పందించారా చంద్రబాబు గారు?

Saturday, November 7th, 2020, 07:40:25 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ నే, గత టీడీపీ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాడేపల్లి గూడెంలో రవాణా శాఖ MVI నడిరోడ్డుపై లంచాలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియా లో కనిపించగానే గంటల వ్యవధిలోనే సస్పెండ్ చేసింది ప్రభుత్వం అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇలా ఎప్పుడైనా స్పందించారా చంద్రబాబు గారు అంటూ సూటిగా ప్రశ్నించారు. పైగా అలాంటి వారిని వెనకేసుకు వచ్చి మీడియా లో కనిపించకుండా దాచిన చరిత్ర తమరిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరు పై కొందరు మాత్రం ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ తో ఎందుకు గానీ, తమరు ఏం చేస్తున్నారు అంటూ వైసీపీ తీరును ప్రశ్నిస్తున్నారు.