ప్యాకేజీ మాటే ఎత్తలేదని బుకాయిస్తున్నాడు – వైసీపీ ఎంపీ

Friday, November 6th, 2020, 07:31:40 AM IST

Vijaya_sai

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్థతి ఏర్పడింది. రాజధాని మరియు ప్రత్యేక హోదా ఏపీ కి అవసరం అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టీ, ప్యాకేజీ కి గత టీడీపీ ప్రభుత్వం మొగ్గు చూపింది అని ఇప్పటికే వైసీపీ నేతలు దారుణ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే టీడీపీ గతం లో తీసుకున్న నిర్ణయం గుర్తు చేస్తూ టీడీపీ ప్రవర్తిస్తున్న తీరును వైసీపీ కీలక నేత, ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్యాకేజీ ఇవ్వడమన్నా, తీసుకోవడం అన్నా బాబు గారికి ఎక్కడా లేని ఇది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. స్పెషల్ స్టేటస్ వస్తే దక్కేది 3,500 కోట్ల రూపాయలే అని, అదే ప్యాకేజీ అయితే 25 వేల కోట్లు వచ్చి పడతాయి అని నాలుక మడతసి రాష్ట్రానికి పంగనామాలు పెట్టాడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడేమో అబ్బెబ్బే ప్యాకేజీ మాటే ఎత్తలేదు అని బుకాయిస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే గతంలో ప్రతి పక్ష పార్టీ నాయకుడు గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తాం ఎంపీ లను ఇవ్వండి అంటూ ప్రజలను కోరిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు వైసీపీ తీరును సైతం ఎండగడుతూ వరుస ప్రశ్నలు వేస్తున్నారు.