కుప్పం ప్రజలకు ఇన్నేళ్లలో గుక్కెడు తాగునీరు అందించలేకపోయారే

Tuesday, November 3rd, 2020, 07:27:31 AM IST

ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం కూడా రాష్ట్రం లో ఎలాంటి మార్పులు, అభివృద్ది లేదు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అయితే బాబు పుట్టిన 1950 లో కుప్పం ఒకటే కాకుండా 90 శాతం గ్రామాలకు కరెంట్ లేదు అని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, మీ కుప్పం నియోజక వర్గం ప్రజలకు ఇన్నేళ్లలో గుక్కెడు తాగునీరు అందించ లేకపోయారే, దాన్ని ఏమనాలి అంటూ చంద్రబాబు నాయుడు ను ఎంపీ విజయసాయి రెడ్డి నిలదీశారు.వ్యవసాయం దండగ అని తేల్చారు కాబట్టి, సాగు నీరిచ్చే ఉద్దేశ్యం లేదనుకుంటాం అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నన్ని రోజులు కూడా సొంత ప్రయోజనాల కోసం, తన బినామీల కోసం పని చేశారు అని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తూ ఉంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. టీడీపీ ఏం అభివృద్ది చేసింది అనే బదులుగా, మీరు కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి అంటు విమర్శస్తున్నారు.