విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన విజనరీ కదా

Wednesday, October 28th, 2020, 08:30:30 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ల నుండి యూనివర్సిటీ ల వరకు నిధులు ఇవ్వకుండా గాలికి వదిలేసి ప్రైవేట్ విద్యా సంస్థలను ఎగదోషాడు అంటూ చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే తన బంధువర్గం, పార్టీకి ఫండింగ్ చేసే కార్పొరేట్ మాఫియా కి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు బాబు అని ఘాటు విమర్శలు చేశారు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన విజనరీ కదా అంటూ సెటైర్స్ వేశారు విజయసాయి రెడ్డి.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ అభిమానులు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యల ను గుర్తు చేస్తూ అందుకు సంబంధించిన వాటిని పోస్ట్ చేస్తున్నారు. అయితే జగన్ పాలన విధానం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి కొందరు మాత్రం విజయసాయి రెడ్డి తీరు పై విమర్శలు చేస్తున్నారు.