ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది?

Friday, October 23rd, 2020, 07:33:35 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది విషయం పై అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఇప్పటికీ కూడా ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విడిపోయిన అనంతరం నుండి దీని పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు టీడీపీ అధికారం లో ఉండగా, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అయితే ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి టీడీపీ వైసీపీ కి గల వ్యత్యాసాన్ని తెలిపే పలు వ్యాఖ్యలు చేశారు.

ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన కోసం, తన వారి కోసం ఆరాటం అని, సీఎం జగన్ మోహన్ రెడ్డి వందల కులాల, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం అంటూ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయం పై ఇంకా వైసీపీ నేతలు టీడీపీ తీరును ఎండగడుతూ ఉన్నారు, సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయం ను ప్రశంసిస్తూ ఉన్నారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరు పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని లేకుండా చేసి, ప్రజలకు ఉచితాల్ని వెదజల్లి బిచ్చగాళ్ల ను చేస్తుంది అన్నట్లు గా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ తీరు ను విమర్శిస్తున్నారు.