ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి – వైసీపీ ఎంపీ

Tuesday, October 20th, 2020, 07:20:03 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కమిటీ లకు కొత్తగా సభ్యులను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గా అచ్చెన్నాయుడు ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు పే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఈ వ్యవహారం పై సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ విమర్శలు చేశారు.

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీ లను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ చెక్కర్లు కొడుతున్నాయి అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి కానీ, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నపుడు ఒకలాగా, లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారు అని ఎంపీ విజయసాయి రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.