బీసీలను ఎదగకుండా చేసిన ఘనత బాబు గారిది – వైసీపీ ఎంపీ

Monday, October 19th, 2020, 09:30:14 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ను ప్రశంసిస్తూ నే, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీసీ లు అంటే బ్యాక్ బొన్ వర్గాలు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి చెబుతున్నారు అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బీసీ ల ఆత్మ గౌరవం ను పెంపొందించేలా 56 కార్పొరేషన్ లకు ఛైర్ పర్సన్లు, సభ్యులను నియమిస్తే పచ్చ పార్టీ గంగ వెర్రులెట్టుతోంది అని విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీసీ లను ఎదగకుండా చేసిన ఘనత బాబు గారిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, మరి కొందరు మాత్రం వైసీపీ తీరు ను ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు.