చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ

Saturday, October 17th, 2020, 09:28:34 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మహిళల భద్రత గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని తెలిపారు. తహశీల్దార్ వనజాక్షి పై జరిగిన దాడి విషయాన్ని మరొకసారి విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. వనజాక్షి గారి పై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పు అని రౌడిని వెనకేసుకొచ్చినది ఎవరూ అంటూ సూటిగా ప్రశ్నించారు. బిటెక్ విద్యార్దిని రిషితేశ్వరి ప్రాణాలను తీసినవారని కాపాడింది మీరు కాదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అనవసరంగా ప్రతి విషయం లో కలుగజేసుకుంటుంది అని కొందరు విమర్శిస్తూ ఉండగా, మరి కొందరు మాత్రం వైసీపీ నేతల తీరును తప్పు పడుతున్నారు. మరి దీని పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.