ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేయడం కాక మరేమిటి!

Friday, October 9th, 2020, 03:00:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ పై వరుస విమర్శలు చేస్తున్న తెలుగు దేశం పార్టీ నేతల పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. తనను తాను పాతాళం లోకి గిరాటేసుకోడం లో బాబు గారినీ మించిన అనుభవజ్ఞుడు ప్రపంచం లోనే లేరు అని విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు. రఫెల్ విమానాల కొనుగోళ్లలో 59 వేల కోట్ల స్కాం కి పాల్పడ్డారు అని దుమ్మెత్తి పోశాడు, అదే నోటి తో రఫెల్ ఫైటర్ల తో దేశం శక్తి పెరిగింది అని కోనియాడటం ఊసరవెల్లులను సిగ్గు పడేలా చేయడం కాక మరేమిటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పై అదే తరహాలో విమర్సలు చేస్తున్నారు. కొందరు మాత్రం వైసీపీ పాలన విధానం పై, విజయసాయి రెడ్డి తో పాటుగా సీఎం జగన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు.