అలా చేస్తే ప్రజలు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారు – విజయసాయి రెడ్డి

Tuesday, September 15th, 2020, 01:09:46 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీ వైసీపీ కి చెందిన నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వైఖరి ను మరోమారు ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు. ఏ పథకం ప్రవేశ పెట్టినా చంద్రబాబు నాయుడు శోకాలు పెట్టీ అడ్డుకోవాలని చూస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పం ముందు ఈయన ఆటంకాలు ఏమీ పని చేయవు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇలాగే చేస్తూ పోతే, ప్రజలు మీకు శాశ్వతం గా చెక్ పెట్టీ రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పథకాలు పెడుతున్నారు సరే, వాటికి డబ్బులు ఎక్కడినుండి అప్పుగా తెస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. తిరిగి ఆ భారం అంతా కూడా ప్రజల నెత్తిమీద వేస్తారు కదా అని తెలిపారు. అయితే అలాంటప్పుడు ఈ పథకాలు అవసరమా అని నిలదీశారు. మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను సోమరులు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.