అబద్దం నడిచొస్తే చంద్రబాబు లా ఉంటుంది – విజయసాయి రెడ్డి

Sunday, September 6th, 2020, 02:35:57 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పై మరొకసారి వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అబద్దం నడిచోస్తే చంద్రబాబు లా ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిదు ఇందుకు తాజా నిదర్శనం ఇదే అంటూ, కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా చేసిన తొలి సంతకం పై కూడా అబద్దం అడేశారు చంద్రబాబు అంటూ విమర్శించారు. నీ అబద్ధాలకు ప్రజలు సిగ్గుపడుతున్నా చీ బీ ఎన్ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. నీయంత చరిత్ర హీనుడు ను ఈ దేశం చూడలేదు, చూడబోదు అని అన్నారు.

విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వం పాలన విధానం పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రతి పక్ష పార్టీ ల పై ఆరోపణలు చేయడం కాకుండా, రాష్ట్ర అభివృద్ది కోసం పాటు పడాలి అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొందరు మాత్రం తెలుగు దేశం పార్టీ, ఇప్పుడు వైసీపీ సేమ్ టు సేమ్ అని అంటున్నారు.