సరిగా తెలుగు మాట్లాడటమే రాదు – అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టి.

Thursday, September 3rd, 2020, 10:21:16 PM IST

Ycp-mp-vijayasai-reddy-comm
తెలుగు దేశం పార్టీ నేతల పై, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై, నారా లోకేష్ ల పై తరచూ విమర్శలు చేసే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి నారా లోకేష్ ను, చంద్రబాబు నాయుడు లను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగా తెలుగు మాట్లాడటమే రాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టి అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత దృోహో, దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న మీ నాన్నారు ను అడుగు చెప్తాడు అంటూ విమర్శించారు.

అంతేకాక దళిత రిజర్వుడు స్థానాల్లో గత రెండు ఎన్నికల్లో టిడిపి ఎన్ని సీట్లు గెలిచిందో లెక్కలు చూస్కో లోకేషం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒకరు టీడీపీ పై విమర్శలు చేస్తుండగా, టీడీపీ అభిమానులు సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల పై చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ను ప్రశ్నిస్తూ చేస్తున్న విమర్శలకు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు ఇలా స్పందించడం జరుగుతుంది.